Home  »  TV News  »  Ye Devi Varamo Neevu: ఆశ్రమంలో రౌడీల దౌర్జన్యం.. మాస్ ఫైట్‌తో హీరోగా మారిన దొంగ!

Updated : Jul 9, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో‌ నీవు(Ye Devi Varamo Neevu )'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-03 లో.. శబరి అనాధాశ్రమానికి అర్థరాత్రి ఒక దొంగోడు వస్తాడు. వాడిని ఆశ్రమంలోని చిన్నపిల్లలు ఇంకా అంజలి కలిసి కట్టేస్తారు. ఇక మరుసటిరోజు జానకమ్మ గుడికెళ్ళి వస్తుంది. ఇక పిల్లలు తనని ఆపుతారు. ఏంటి అందరు ఇక్కడున్నారని జానకమ్మ అడుగుతుంది. నిన్న నైట్ మేము ఒక డైనోసార్ ను పట్టుకున్నామని ఒక పాప చెప్తుంది. ఒక బూచోడిని పట్టుకున్నామని మరో పాప చెప్తుంది. అసలు ఏమి మాట్లాడతున్నారో అర్థం అవ్వడం లేదని జానకమ్మ అడుగుతుంది. ఒక దొంగోడు వచ్చాడని అంజలి చెప్తుంది. ఎక్కడ అని జానకమ్మ అడుగగా.. ఒక గదిలో బట్టల కింద తనకి కట్లు కట్టేసి నోటికి బట్ట చుట్టేసి బంధిస్తారు.

ఇక జానకమ్మ అతడిని చూసి కట్లు విప్పమని చెప్తుంది. ఇక అతడు అందరిని తిడతాడు. అసలు మీరు మనుషులేనా నన్నే కొరుకుతారా.‌‌. అలా కొడుతారా అని అతను అనగానే అసలు ఎవరు నువ్వు అని జానకమ్మ అడుగుతుంది. నేను అనాధని ఆకలి అయింది.. ఏం అయినా దొరుకతాయా అని వచ్చానని అతను చెప్తాడు. నన్ను ఎవరో కొరికారు అని అతను అనగానే అందరు అంజలిని చూపిస్తారు.‌ ఇక అదే సమయంలో ఆశ్రమానికి రౌడీలు వస్తారు. జానకమ్మ ఉన్నపలంగా ఈ చోటుని ఖాళీ చేసి వెళ్ళాలని రౌడీలు బెదిరిస్తారు. ఏంటండి ఈ దౌర్జన్యం అని ఒక ముసాలయన అడుగగా అతడిని కొడతారు. మీరు ఖాళీ చేయకపోతే మీ ఆశ్రమంలోని ఆడవాళ్ళ మాన, ప్రాణాలు పోతాయని రౌడీలు బెదిరిస్తారు. అప్పుడే రాత్రి దొంగతనానికి వచ్చిన అతను రౌడీలని కొడతాడు. దాంతో అందరు అతడిని హీరో హీరో అంటారు. ఇక అందరు అతడికి థాంక్స్ చెప్తారు. 

మరోవైపు గీతాంజలి వాళ్ళ కూతురు, కొడుకు అర్థరాత్రి లేట్ గా ఇంటికి వస్తారు. ఇక వాళ్ళ అమ్మ‌ గీతాంజలి చూస్తుందేమోనని మెల్లిగా వస్తుంటారు. అయితే గీతాంజలి మాత్రం వాళ్ళిద్దరిని చూస్తుంది. ఏంటి రోజు లేటుగానే వస్తున్నారా.. ఈ రోజే లేటుగా వచ్చారా అని గీతాంజలి అడుగుతుంది. ఈ రోజు ఒక్కరోజే లేట్ గా వచ్చాం మమ్మీ.. ఇంకెప్పుడూ లేటుగా రామని వాళ్ళు అంటారు. రూల్స్ పాటించాలి.‌. ఇంకోసారి లేట్ గా వస్తే శిక్ష తప్పదని గీతాంజలి అంటుంది. సరేనని వాళ్ళు వెళ్తారు. ఎందుకు గీతూ వాళ్ళ పట్ల అంత స్ట్రిక్స్ గా ఉంటావని గీతాంజలితో తన భర్త అంటాడు. నాది బాధ్యత, నేను ఇప్పుడు ఇలా ఉండటమే కరెక్ట్ అంటుంది‌. తర్వాత వాళ్ళు పడుకున్నాక వారి పట్ల కేరింగ్ చూపిస్తుంది గీతాంజలి. ‌ఇక తన భర్త వచ్చి..‌నువ్వు గ్రేట్ అటు బాధ్యత, ఇటు ప్రేమ చూపిస్తావని అతను అంటాడు. వాళ్ళ పట్ల ఇలానే ఉండాలని గీతాంజలి అంటుంది. కానీ వారిని నువ్వు ఎలా చూస్తున్నావో వారికి అర్థమవ్వడం లేదని, నిన్ను వాళ్ళు అర్థం చేస్కోవడం లేదని గీతాంజలితో అతను  చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.